నవంబర్ 11 న విడుదల కాబోతున్న” కాళరాత్రి “

10x20_01“ఆడోరకం ఈడోరకం “,స్పీడ్ ఉన్నోడు” ,జాదూగాడు” లాంటి చిత్ర్రాలలో నటించిన సోనారిక ప్రధాన పాత్రలో”కాళరాత్రి “చిత్రం తెరకెక్కింది . లక్ష్మి టాకీస్ సమర్పణలో” సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్”పతాకం పై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రం నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ”దెయ్యాలు రేప్ చేస్తాయా … అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము” . ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు బిన్నంగా ఈ చిత్రం ఉంటుంది .
సోనారిక అద్భుతమైన నటనతో ఈ చిత్రంలో యువత ను కనువిందు చేస్తుంది .నవంబర్ 11 న ఆంధ్ర మరియు తెలంగాణ లలో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్ లలో రిలీజ్ చేయనున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ :లక్ష్మి టాకీస్ , సంగీతం :వివేక్ ,కెమెరా :జావేద్ ,నిర్మాత :గుడి వంశీధర్ రెడ్డి ,కథ స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :రాజీవ్

Write a review

Your email address will not be published. Required fields are marked *

*