మారుతి ఫ్యామిలీ ఫంక్షన్ కి హాజరైన అల్లు అర్జున్

ఒకప్పుడు యూత్ చిత్రాలకు దర్శకుడిగా ఉన్న మారుతి ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ చిత్రంతో స్టార్ డైరెక్టర్ ముద్ర వేయించుకున్న మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ గా శర్వానంద్ తో మహానుభావుడు అనే సినిమామ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 19న లాంచ్ కానున్నట్టు ఫిలిం నగర్ టాక్. అయితే మారుతి తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ ని నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులను ఆహ్వనించాడు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి హాజరై సందడి చేశాడు. బన్నీ రాకతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక వైపు షూటింగ్ జరుపుతూనే మరో వైపు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తదితర పనులన్నింటిని వేగవంతం చేస్తున్నాడు హరీష్. సమ్మర్ కి ఈ మూవీ రానుందని చెబుతున్నారు.

Write a review

Your email address will not be published. Required fields are marked *

*