ధృవ మూవీ రివ్యూ : స్టైలిష్ రీమేక్

టైటిల్ : ధృవ
తారాగణం : రామ్చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, పోసాని కృష్ణమురళి
సంగీతం : హిప్ హప్ తమిళ
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్, ఎన్ వీ ప్రసాద్

కథ:
కథలోకెల్తే ధృవ (రామ్ చరణ్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అంటే మామూలు పోలీస్ కాదు. తనకంటూ ఒక గోల్ ఉంటుంది, అది ఏంటంటే ఎవర్ని అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారొ అలాంటి క్రిమానల్ ని అంతం చెయ్యాలని. అలాంటి వాన్నే తన టార్గెట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. అతనే సిద్దార్థ్ అభిమన్యు (అరవింద స్వామి) చాలా స్మార్ట్ గా కనిపించే కేర్లెస్ అండ్ రూత్ లెస్ బిజినెస్ మ్యాన్. ఒక సైంటిస్ట్ లా అందరి దగ్గరా చలామని అవుతున్న సిద్ధార్థ్ చీకటి కోణాన్ని అంతం చెయ్యాలనుకుంటాడు ధృవ. ఇదిలా ఉండగా పోలీస్ ట్రైనింగ్ లో పరిచయం అయిన ఇషిక(రకుల్ ప్రీత్ సింగ్) ధృవని అమితంగా ప్రేమిస్తుంటుంది…ధృవ మొదట్లో తిరస్కరించినా తరువాత ఇషికా ప్రేమలో పడిపోతాడు. ఈ ప్రేమ ధృవ లక్ష్యాన్ని దారి మళ్ళిస్తుందా….?? లేదా ఆ లక్ష్యాన్ని చేదించడానికి ఆయువు పోస్తుందా…?? సిద్ధార్థ్ చీకటి కోణాన్ని ఎలా అంతం చేశాడు….?? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ:
ఇక విశ్లేషణ విషయానికొస్తే ఇది తమిళ సినిమా రీమేక్ అన్నవిషయం తెలిసిందే,కథలో ఎలాంటి మార్పులు చెయ్యకుండా ఎలా ఉంటే అలానే తీసేసారు. సినిమా మొదలవ్వడం స్లోగా మొదలైనా ఇంటర్వల్ తరువాత సినిమా ఊపందుకుంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. అన్ని కోణాల్లో సినిమా అందర్నీ అలరిస్తుంది. రీమేక్ అనగానే మన నేటివిటికి తగ్గట్టు మార్పులు చెయ్యడం కామన్ కానీ ఈ సినిమాకి అలాంటివి ఏమీ చెయ్యకుండా చాలా మంచి పని చేసినట్టు అనిపిస్తుంది. ఆ కథను ఎక్కడా స్పాయిల్ చెయ్యకుండా చాలా బాగా డీల్ చేశారు.

నటీనటులు:
ఎప్పటిలాగే నటీనటులు గురించి చెప్పాలంటే ముందు మన హీరో రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి ధృవ అనే పాత్రకి అచ్చుగుద్దినట్టు సెట్ అయ్యాడు. కండలు తిరిగిన బాడీతో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. నటన విషయంలో చరణ్ కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తుంది ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా బాగా చేశాడు. తరువాత చెప్పుకోవాల్సింది అరవింద స్వామి గురించి ఆయన పోశించిన పాత్ర సినిమాకే ఆయువు పట్టు అనే చెప్పాలి. విలన్స్ ఇలా కూడా ఉంటారా అనుకునేలా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్ గా అదరగొట్టేసారు. నిజానికి కొన్ని చోట్ల రామ్ చరణ్ ని డామినేట్ చేసేసాడు.ఇక హీరోయిన్ గా చేసిన రకుల్ పాత్ర చిన్నదే అయిన తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక పాటల్లో తన అందాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేసింది. ఇంకా నవదీప్, అలీ, షేయాజి షిండే తదితరులు ఎప్పటిలాగానే వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి.

సాంకేతిక విభాగం:
తమిళ సినిమాని బాగ్ వోన్ చేసుకొని తన మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన విధానం సుపర్బ్ అనే చెప్పాలి. చాలా బాగా డీల్ చేశాడు,టేకింగ్ విషయంలో ఈయనని అభినందించాల్సిందే. ఈ సినిమాకి హిప్ హప్ తమిళ సంగీతం అంతలా ఆకట్టుకొలేదు కానీ నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. సినిమా చూసిన తరువాత మనకు మైండ్ లో మెదిలేవి ఇందులో ఉన్న విజ్యువల్స్, సినిమాటోగ్రాఫర్ వినోద్ పనితీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయేలా తీశారు. గీత ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు ఎప్పటిలాగానే ఉన్నతంగా ఉన్నాయి.

చివరి మాట : స్టైలిష్ రీమేక్

Write a review

Your email address will not be published. Required fields are marked *

*