దర్శకుడు గుణశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి ఓ ఘాటు లేఖ

దర్శకుడు గుణశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఘాటు లేఖ రాశాడు. పొగుడుతూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తూ కడిగేశాడు. గతంలో తాను స్వయానా నిర్మాత అవతారం ఎత్తి తీసిన రుద్రమదేవి చిత్రానికిగానూ.. వినోదపు పన్ను రాయితీపై ఈ లేఖ రాశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన గుణశేఖర్.. తన సినిమాకు మాత్రం చేస్తాం..చేస్తాం అని చెప్పి.. ఫైలును పెండింగ్‌లో పెట్టేసి చివరకు చేతులెత్తేసిన వైనాన్ని వివరించాడు. తెలంగాణ ప్రభుత్వం తనకు పన్ను మినహాయింపునిచ్చినా.. ఏపీ అధికారులు మాత్రం దరఖాస్తును పరిశీలించినట్టే పరిశీలించి చివరకు చేతులెత్తేశారని పేర్కొన్నాడు. ఆ లేఖ సారాంశం ఇది…

Write a review

Your email address will not be published. Required fields are marked *

*