ప్రపంచవ్యాప్తంగా భారత నటులకు గొప్ప సమయం

ప్రపంచవ్యాప్తంగా భారత నటీనటులు తమ సత్తా చాటుతున్నారని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అభిప్రాయపడింది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతోపాటు బేవాచ్ మూవీతో సక్సెస్ మీదున్న ప్రియాంక ఈ విషయమై మాట్లాడుతూ భారత నటులకు ఇది గొప్ప సమయమని భావిస్తున్నా. భారత నటీనటులు ప్రపంచవ్యాప్తంగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. భారత యాక్టర్ల టాలెంట్ ప్రత్యేకమైంది. సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. భారతీయ నటులు భవిష్యత్‌లో ప్రపంచ సినీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించింది.

Write a review

Your email address will not be published. Required fields are marked *

*