చిరంజీవి గారూ వెనక్కి వచ్చేసినందుకు థ్యాంక్స్:-రాజమౌళి

ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే.. దాని గురించి దర్శకదిగ్గజం రాజమౌళి ఎప్పుడెప్పుడు రివ్యూలు పెడతాడని అందరూ ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే మనోడు ప్రతీ పెద్ద సినిమాను దాదాపు తొలిరోజు ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 ఆటకు చూసేసి.. వెంటనే దానికి ట్విట్టర్లో రివ్యూ ఇస్తుంటాడు. మరి అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ”ఖైదీ నెం 150” గురించి జక్కన్న ఏమంటున్నాడు.

”బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గారూ వెనక్కి వచ్చేసినందుకు థ్యాంక్స్. 10 ఏళ్ళు మిమ్మల్ని చాలా మిస్సయిపోయాం. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ ప్రాజెక్టుగా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్ చరణ్. వినయ్ గారూ.. కుమ్మేశారంతే. మీకంటే ఈ సినిమాను ఎవ్వరూ బెటర్ గా హ్యాండిల్ చేయలేరు. ఖైదీ టీమ్.. హ్యావ్ ఏ బ్లాస్ట్” అంటూ తన మినీ రివ్యూ అందించాడు రాజమౌళి. ఖైదీ నెం 150 ప్యూర్ గా చిరంజీవి పునరాగమనం కోసం క్రియేట్ చేసిన ఒక ప్రాజెక్టు కాబట్టి.. రాజమౌళి కూడా అదే రేంజులో ఎక్సయిట్ అయినట్లున్నాడు.

Write a review

Your email address will not be published. Required fields are marked *

*