అన్నయ్య అన్నయ్యే అనుకున్నాను:-శ్రీకాంత్‌

చిరంజీవితో ప్రముఖ హీరో శ్రీకాంత్‌కు ఎంతో అనుబంధం ఉంది. శ్రీకాంత్‌ అంటే చిరంజీవి గారికి ఎంతో ప్రేమ. అందుకే చిరంజీవిగారి 150వ చిత్రం వస్తోందంటే ఎంతో ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అన్నయ్యను 150వ సినిమా చేయమని గట్టిగా అడిగిన వాళ్లలో నేనూ ఒకడిని. అన్నయ్య కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలబడిపోయే ఈ సినిమాలో నేనూ చేయాలనుకున్నాను. కానీ సరైన పాత్ర లేదు ఇందులో. ఇది నాకు నిరాశ కలిగించిన విషయం. కానీ అన్నయ్య 150వ సినిమా చేస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డాను. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌, ఫస్ట్‌లుక్‌లు చూస్తుంటే అదుర్స్‌ అనిపించింది. అన్నయ్య అన్నయ్యే అనుకున్నాను. ఈ చిత్రంలో అన్నయ్య ఎంత స్మార్ట్‌గా ఉన్నారని! ఎంత అందంగా ఉన్నారని! మళ్లీ ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఖైదీ నెం. 786’ చిత్రాల నాటి చిరంజీవిని చూసినట్టుంది. నాకే ఇంత బాగుంటే అభిమానులు ఇంకెంత ఆనందిస్తారో!

ముఖ్యంగా అన్నయ్య ఈ సినిమాకు ఎంతో శ్రమపడ్డారని తెలిసింది. ఈనాటి యంగ్‌ హీరోలా చాలా కష్టపడ్డారని యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా ఆయన పడే శ్రమ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ సినిమాకైతే మరింతగా ఆయన కష్టపడి ఉంటారనడంలో సందేహం లేదు. అన్నయ్య సినిమా కెరీర్‌లో ‘ఖైదీ నెం. 150’ చిత్రం ఒక మాన్యుమెంట్‌లా కలికి తురాయిలా నిలిచిపోతుందని, నిలిచిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని” తెలిపాడు.

Write a review

Your email address will not be published. Required fields are marked *

*